బాలెట్ గుర్తు మార్పుపై తంగళ్ళపల్లిలో సంచలనం
పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
చెరుకుపల్లి రాకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించగా, ఆ గుర్తును ఆకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది.ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థికి కేటాయించిన గుర్తును ఇలా రాత్రికి రాత్రే మారుస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇది తమపై స్పష్టమైన అన్యాయం అని రవీందర్ వాపోయారు.ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి తగిన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.