బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఈరోజు అనగా 24/12/2025,బుధవారము రోజున జరుపుకోవడం జరిగింది ఈరోజు చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజెల్స్,తూర్పు దేశపు జ్ఞానులు లాగా,మేరి,జోసఫ్ గొర్రెల కాపరుల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి.రవీంద్రనాథ్ సార్ ప్రిన్సిపల్ మాధవీలత మేడం, మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నారు క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ అని ఏసుక్రీస్తు పుట్టిన రోజులు ఈరోజు జరుపుకుంటారు ఏసు క్రైస్తవ మత మూలపురుషుడు ఈయన సాధారణంగా ఏసుక్రీస్తు గా కూడా వ్యవహరించబడతాడు ఇందులో క్రీస్తు అన్న పదం గ్రీకు భాషలో క్రీస్తోస్ అంటే అభిశక్తుడు అనే అర్థం వచ్చే పదము నుండి పుట్టింది పాపం చేసిన వాడికి శిక్ష విధించడం కాదు పాపమే మరణించాలి అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై యేసు క్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం అందుకే నశించిన దాన్ని వెతికే రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్లి బాల యేసును దర్శించి ఆనంద భరితులయ్యారు, ఆ గుర్తుగా వారు బాలయేసునకు కానుకలను సమర్పించారు. అవి బంగారం గోలము, పరిమళ సాంబ్రాణి వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యమని తెలిపారు. క్రైస్తవ మతస్తులందరికీ మిత్రులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ సార్, మరియు ప్రిన్సిపల్ మాధవీలత మేడం, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.