PS Telugu News
Epaper

బాసర ఆర్జీయూకేటీ సరికొత్త రికార్డు: ప్రతిరోజు 3,238 మంది విద్యార్థులతో స్టడీ అవర్స్

📅 27 Feb 2026 ⏱️ 6:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బాసర రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న ‘నైట్ స్టడీ అవర్స్’ ప్రోగ్రామ్ ఏకంగా మూడు రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించింది.రికార్డుల వివరాలు:పీయూసీ–1, పీయూసీ–2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో స్టడీ అవర్స్‌లో పాల్గొనడం ఈ రికార్డుకు దారితీసింది. ఈ అద్భుతమైన ఫీట్‌ను గుర్తిస్తూ..ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు ధృవీకరణ పత్రాలను అందజేశాయి. ప్రోగ్రామ్ ఎలా సాగింది ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అకాడమిక్ బ్లాక్–1 లోని 46 క్లాస్ రూమ్‌లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చదువుకోవడంతో పాటు సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు (డౌట్స్ క్లారిఫికేషన్) ఈ సమయాన్ని కేటాయించారు. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిరాఘాటంగా, ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.
అధికారుల హర్షం: ఈ విజయానికి కృషి చేసిన స్టడీ అవర్స్ ఇన్-ఛార్జ్ డాక్టర్ గుజ్జరి శంకర్ ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. శంకర్ పర్యవేక్షణలో విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ అకడమిక్ పరంగా రాణిస్తున్నారు. డాక్టర్ శంకర్ నాయకత్వంలో అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో ఈ రికార్డు సాధ్యమైందని వారు కొనియాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదలే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని వారు పేర్కొన్నారు. ఈ విజయంతో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర విద్యా రంగంలో మరో మైలురాయిని నెలకొల్పి, భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతోంది.ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన డీన్ అకాడమిక్స్ శీలం శేఖర్, డీన్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డాక్టర్ విఠల్, డా.జి.నాగరాజు వివిధ విభాగాల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బందికి శంకర్ ధన్యవాదాలు తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిబద్ధత విద్యాలోకానికి ఆదర్శంగా నిలిచిందని యూనివర్సిటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

Scroll to Top