PS Telugu News
Epaper

బాసర మండలంలో రూ.92 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ..

📅 10 Feb 2026 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

ఈ రోజు బాసర మండల కేంద్రంలో రూ.92 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు.మండల కేంద్రంలోని రూ.20 లక్షల నిధులతో డ్రెయిన్ నిర్మాణం, రెండు అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు, అలాగే రూ.21 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆలయ ఆవరణలో రూ.7 లక్షల నిధులతో త్రాగునీటి (డ్రింకింగ్ వాటర్) పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కిర్గుల్–K గ్రామంలో పాఠశాల విద్యార్థుల భద్రత దృష్ట్యా రూ.10 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణానికి, మహిళల సంక్షేమం కోసం రూ.10 లక్షల నిధులతో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top