PS Telugu News
Epaper

బిజెపి ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టాలు అందజేత…

📅 01 Sep 2025 ⏱️ 5:44 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

టార్పాలిన్ పట్టాలు అందజేస్తున్న దృశ్యం…

రుద్రూర్, సెప్టెంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ గ్రామంలో బైండ్ల గంగాధర్, బుడ్డోల్ల ఎల్లయ్య ఇద్దరి ఇల్లులు వర్షానికి దారుణంగా కురుస్తున్నాయి. ఇంటిపైన కప్పుకోవడానికి పట్టాలు కావాలని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి కృష్ణను ఆశ్రయించగా వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కోనేరు శశాంక్ బాధితుల ఇండ్లకు టార్పాలిన్ పట్టాలు ఇప్పించడంతో సోమవారం బాధ్యత కుటుంబానికి బిజెపి నాయకులు టార్పాలిన్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు అలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, బేకరీ వినోద్ కుమార్ మరియు మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్ యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top