PS Telugu News
Epaper

బీజేపీ జోరుగా ప్రచారం..

📅 09 Dec 2025 ⏱️ 3:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

.రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మంగళవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాంకర్ మంజుల – రామ్ రాజ్ దంపతులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాండ్ చప్పులతో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో బిజెపి పార్టీ వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top