PS Telugu News
Epaper

బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం

📅 18 Mar 2026 ⏱️ 7:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి వాక్య
ఈరోజు బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అంటున్నారని బిజెపి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని ముట్టడి చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకు ముట్టడి చేస్తున్నారా అని నగేష్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని బయటకు తీస్తామని ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు నల్లధనాన్ని బయటకు తీయనందుకు ముట్టడి చేస్తారని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని, స్థానిక ఎంపీ కేంద్రం నుండి నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకో రాలేదని జిల్లా అభివృద్ధి గురించి అరవింద్ ఆలోచించిందే లేదు అని, మాధవ నగర్ బ్రిడ్జి గత ఏడు సంవత్సరాలుగా నత్తనడకన నడుస్తున్న పట్టించుకున్న పాపాన అరవింద్ లేడు అని నగేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది అని నగేష్ రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుంది అని, ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది అని, గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో టిఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 24 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ప్రభుత్వమే అందిస్తుంది అని, ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలు వాటిని తినలేక దళారులకు అమ్ముకొని నష్టపోవడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా రైతు సోదరుల కొరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం, రైతు భరోసా ద్వారా ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది అని, పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది అని, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, మహిళా సోదరీమణుల కొరకు ఉచిత ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, 80,000 ఉద్యోగాలు రాష్ట్రంలో కల్పించడం జరిగింది అని నగేష్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలలో బిజెపి బీఆర్ఎస్ పార్టీలు లోభాయికర ఒప్పందాలతో పరిపాలన చేసి అభివృద్ధిని గాలికి వదిలేసారని, బిజెపి రైతుల పక్షాన పేద ప్రజల పక్షాన ఆలోచించడం మానేసి కేవలం కార్పొరేట్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని, కార్పొరేట్ సంస్థల వారికి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది కానీ రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో విఫలం అయ్యిందని, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది మంచి విషయమే కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదు అని నగేష్ రెడ్డి ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించినప్పుడే పసుపు రైతులకు న్యాయం జరుగుతుంది అని నగేష్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో క్రూడ్ ఆయిల్ దారి 140 ఉన్న సందర్భంలో పెట్రోల్ 70 రూపాయలు డీజిల్ 60 రూపాయలకు అందించడం జరిగిందని, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్ ధరను 110 రూపాయలకు, డీజిల్ ధరను 97 రూపాయలకు పెంచడం జరిగిందని,వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా 400 నుండి 1000 రూపాయలకు పైగా చేయడం జరిగిందని బిజెపి ప్రభుత్వం ఎన్ని వైఫల్యాలకు కారణమైన కూడా బిజెపి నాయకులు సిగ్గు లేకుండా 21వ తేదీన ముట్టడి చేస్తామని చెప్పడం అనేది ఏదైతే ఉందో దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని నగేష్ రెడ్డి అన్నారు. బిజెపి నాయకులు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత మాట్లాడాలీ తప్ప వారు తప్పుచేసి ఎదుటి వారిపై నిందలు వేయకూడదు అని. బిజెపి చేస్తున్న ముట్టడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని నగేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు .

Scroll to Top