PS Telugu News
Epaper

బీసీలు ఏకం కావాలి – రాగ్య అరుణ్ కుమార్

📅 14 Mar 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో బీసీ జనసేన కార్యాలయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఆర్.కృష్ణయ్య వారసుడు రాగ్య అరుణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత, మహిళలు మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. కళాశాలల్లో బీసీ విద్యార్థులకు తగిన సీట్లు కల్పించాలని కోరారు. యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. బీసీలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఉద్యోగాలు మరియు రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప, జిల్లా అధికార ప్రతినిధి స్రవంతి రాజ్, జిల్లా అధ్యక్షులు కాటన్ భాగ్యలక్ష్మి గౌడ్, జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేష్, షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డమీద రమేష్, బీసీ జాతీయ జనసేన మహిళా సీనియర్ నాయకురాలు బాస వరలక్ష్మి, నియోజకవర్గ సీనియర్ నాయకురాలు సౌజన్య, టౌన్ సీనియర్ నాయకురాలు మమత, నియోజకవర్గ సీనియర్ నాయకురాలు ఏలూరి వసంత, జిల్లా ఉపాధ్యక్షులు మొగిలేటి నరసింహులు, జిల్లా యువజన అధ్యక్షులు శివ ముదిరాజ్, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటయ్య సార్, సాయిలు, ఆగనూరు బసవప్ప, బైరమణి శంకరయ్య, బుజ్జమ్మ (ఫరూఖ్‌నగర్ మండల అధ్యక్షురాలు), సింధూర (టౌన్ అధ్యక్షురాలు), అరుణ్ సాయి, శ్రావణ్, ఈశ్వరయ్య, చెట్ల బాలరాజు, రాములు, కిషన్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top