PS Telugu News
Epaper

బీసీ జనసేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

📅 19 Feb 2026 ⏱️ 7:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో బీసీ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ అధ్యక్షురాలు జక్కుల జలజ తదితర నాయకులు హాజరై శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. వారి స్ఫూర్తితో సమాజంలో ధైర్యం, స్వాభిమానం, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని వారు ఆకాంక్షించారు.

Scroll to Top