బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో మరికొన్ని పరిశ్రమలు సంక్రాంతి నాటికి ప్రారంభం
ఫుడ్ పార్క్ పురోగతి పై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కల్సి మంత్రి తుమ్మల సమీక్ష
పయనించే సూర్యుడు డిసెంబర్ 16( పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం :ఫుడ్ పార్క్ లో 615 కోట్లు ఆక్వా ప్రాజెక్ట్ పెట్టుబడులు పెట్టనున్న దీపక్ నెక్స్ జెన్ గ్రూఫ్ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల 2016 లో శంకుస్థాపన గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్ .రోడ్ రైల్వే పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఫుడ్ పార్క్ ఏర్పాటులో మంత్రి తుమ్మల ముద్ర.వ్యవసాయ ఉద్యాన ఆక్వా పౌల్ట్రీ రంగాలకు కీలకంగా మారనున్న ఫుడ్ పార్క్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంప్లాయిమెంట్ హబ్ గా మారనున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్ గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.మంగళవారం నాడు సచివాలయం లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఫుడ్ పార్క్ పురోగతి పై సమీక్ష చేశారు.బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీ. ఎం కె.ఎస్ వై పథకంలో భాగంగా సత్తుపల్లి మండలం బుగ్గపాడు లో 2016 ఫిబ్రవరి 5 వ తేదీన ఆమోదం తెలిపారు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ పార్క్ కు నాడు మంత్రిగా ఉన్న తుమ్మల పునాదులు వేశారు.పొలం నుంచి మార్కెట్ వరకు ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కోర్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CPC హబ్ గా ఫుడ్ పార్క్ ఏర్పాటు ఉద్దేశ్యం. ప్రాదమిక ప్రాసెసింగ్ కేంద్రాలు PPC u సేకరణ కేంద్రాలు CC లు CPC కి మద్దతుగా ఉంటాయి.బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో CPC రెండు PPC లు పూర్తి అయ్యాయి.మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 109 కోట్లు అందులో 99 కోట్లు ప్రాజెక్ట్ వ్యయం కాగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి 28 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ప్రస్తుతం 26 ఎకరాల్లో 26 ప్లాట్స్ లో పలు కంపెనీలకు ప్లాట్స్ కేటాయించారు. గొర్లాస్ గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ …ఇన్ఫినిటీ ఇండస్ట్రీస్ లకు ప్లాట్స్ కేటాయించారు. తాజాగా దీపక్ నెక్స్ జెన్ ఆక్వా ప్రాజెక్ట్ కు స్థలం కేటాయించారు. 615 కోట్లు దీపక్ నెక్స్ జెన్ పెట్టుబడులు తో 3200 మందికి ఉపాధిఅవకాశాలుదక్కనున్నాయి.గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్ 2016 లో నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆర్భాటంగాశంకుస్ధాపనచేశారు. తొమ్మిది ఏళ్ళు పూర్తయినా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవ్వ లేదు.రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరాక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల బుగ్గపాడు ఫుడ్ పార్క్ పనులు పురోగతి పై ప్రత్యేక దృష్టి సారించారు.పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఇప్పటికే రెండు దఫాలు సమీక్ష నిర్వహించారు. ఈరోజు జరిగిన సమావేశంలో అనుమతులు వేగవంతం చేసి, సంక్రాంతి నాటికి ఫుడ్ పార్క్ ప్రారంభం చేయాలని సంబధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు..స్ట్రాటజిక్ లొకేషన్ లో మెగా ఫుడ్ పార్క్ రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల యువత ఉపాధికల్పనకు కేరాఫ్ గా మారనున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం కలిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ రంగంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ కు బాటలు వేసి తనదైన ముద్ర వేశారు. వ్యవసాయ ఉద్యాన పంటలకు సత్తుపల్లి అశ్వారావు పేట ప్రాంతాలు కేరాఫ్ గా ఉన్నాయి. దాంతో రైతాంగానికి మేలు చేసేలా పంట ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ పెంచేలా అగ్రి బై ప్రొడక్ట్స్ పరిశ్రమల స్థాపన జరిగేలా ఫుడ్ పార్క్ కు రూపకల్పన చేసారు..రోడ్డు రైల్వే పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా స్ట్రాటజిక్ లొకేషన్ గా సత్తుపల్లి బుగ్గపాడు..మెగా ఫుడ్ పార్క్ కి నాడు మంత్రి తుమ్మల రూపకల్పన చేశారు.. 150 కి.మీ పరిధిలో వ్యవసాయ, ఉద్యాన , ఆక్వా , పౌల్ట్రీ లభ్యత దృష్ట్యా బుగ్గ పాడు లో వ్యూహాత్మక ప్రదేశం గా ఎంపిక చేసారు..
నేషనల్ హైవే రోడ్ నెట్ వర్క్స్..
NH365B నుండి 22కి.మీ
NH 216 నుండి 40 కి.మీ
NH 65 నుండి 104 కి.మీ
నాగపూర్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి…రైల్ నెట్ వర్క్స్ కొత్తగూడెం రైల్వేస్టేషన్ 49కి.మీ
ఖమ్మం రైల్వేస్టేషన్ 92 కి.మీ
కొండపల్లి రైల్వే లింక్ 95 కి.మీ
విమానాశ్రయం..విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 111 కి.మీహైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 299 కి.మీ
సముద్ర నౌకాశ్రయం..
కాకినాడ సముద్ర ఓడరేవు 184కి.మీమచిలీపట్నం సముద్ర ఓడరేవు 170 కి.మీవైజాగ్ సముద్ర ఓడరేవు 325 కి.మీకృష్ణపట్నం సముద్ర పోర్ట్ 420 కి.మీ.కనెక్టివిటీ దృష్ట్యా స్ట్రాటజీకి లొకేషన్ లో మెగాఫుడ్ కోర్ట్ ఏర్పాటు తో ఖమ్మం జిల్లాతో పాటు చుట్టు ఉన్న జిల్లాలలో తెలంగాణ వ్యవసాయ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మంత్రి తుమ్మల అన్నారు.. ఈ సమీక్ష సమావేశం లో ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ IAS , TGIIC వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శశాంక IAS, కమిషనర్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ సుష్మ , TGIIC ED పవన్ కుమార్ , ఫుడ్ ప్రోస్సింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ తదితరులు పాల్గొన్నారు…