బూరుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో బన్సీలాల్
పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాలో ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తవడంతో గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ దిప్ల తనకు మొదటి విడత ఇందిరమ్మల్లో మంజూరు అయిందని దాంతో నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గృహప్రవేశానికి ఫరూక్నగర్ ఎంపీడీవో బన్సీలాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్నగర్ ఎంపీడీవో బన్సీలాల్ ఎంపీఓ జయంత్ రెడ్డి, సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య మాజీ ఉప సర్పంచ్ రెడ్యానాయక్, వార్డ్ సభ్యులు చెప్పట రవీందర్, జ్యోతి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.