బూర్గుల గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు మరియు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి
లబ్ధిదారులు బోడ అనసూయ బోడ భీమయ్యకు సన్మానం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. గ్రామానికి చెందిన బోడా అనసూయ బోడ భీమయ్యకు తొలి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజురవడం జరిగింది. సకాలంలో గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసుకోవడంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్ లబ్ధిదారులను సన్మానించడం జరిగింది. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇల్లు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుమ్మరి నర్సింలు ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుకమర్రి రాజగోపాల్ రెడ్డి మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి వాసవా చారి మరియు వార్డు సభ్యులు సత్యనారాయణ, పవన్ కుమార్ ,సంతోష్ కుమార్ గౌడ్ ,హరీశ్వర్, శేఖర్ జంగయ్య, రాము, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
