బూర్గుల గ్రామం లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
( పయనించే సూర్యుడు మార్చి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్)
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా టిబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాం జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి , డా .పాపారావు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి గారు ప్రారంభించారు దానిలో భాగంగా ఈరోజు బూర్గుల ప్రైమరీ హెల్త్ సెంటర్ బూర్గుల విలేజిలో క్యాంపు నిర్వహించడం జరిగింది . ఈ క్యాంపుకు బూరుగుల ప్రజలందరూ వచ్చి రక్త పరీక్షలు, గల్ల పరీక్షలు, ఎక్సరేలు పరీక్షలు నిర్వహించడం జరిగింది, క్యాంపుకు ప్రజలంతా వచ్చి విజయంతం చేయడం జరిగింది . ఈ క్యాంపులో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి పీహెచ్ సి డాక్టర్ రఘురాం , శ్రీనివాసరెడ్డి, జయేందర్,వెంకటముని,సలాం కహన్ ల్యాబ్ టెక్నీషియన్ ,రెడ్డి నాయక్ హెల్త్ అసిస్టెంట్ , రవికుమార్.గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లు గ్రామ ప్రజలు ఏ.ఎన్.ఎమ్., ఆశాలు అందరు పాల్గొన్నారు.
