బొగ్గు లైన్ లో నివసించే పేదలకు న్యాయం చెయ్యకుండా ఖాళీ చేయిస్తే ఊరుకోం, అడ్డుకుంటామని సిపిఎం హెచ్చరిక.
పయనించే సూర్యుడు జనవరి 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కూటమి ప్రభుత్వ హామీ ప్రకారం రెండు సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి.
నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ లో దాదాపు 100 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న పేద ప్రజలను అభివృద్ధి పేరుతో ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబోమని వారికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఖాళీ చేయించాలని లేకుంటే సిపిఎం పార్టీగా దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్,సీనియర్ నాయకులు తోట మద్దులు,పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు పుల్లా నరసింహ, కే మహమ్మద్ గౌస్,మౌలాలి లు అన్నారు.బొగ్గు లైన్లో నివసించే పేద ప్రజలతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కే. మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో బొగ్గుల వాసులు మహారాజ్, అశోక్,సురేష్, వెంకటరమణరాజు, రామాంజనేయులు, పెద్దక్క, లక్ష్మి,విజయ్, సాయి, కృష్ణ, హరికృష్ణ లతోపాటు 200 మంది బొగ్గులైన్ వాసులు పాల్గొనడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బొగ్గులైన్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు ఫరూక్ , మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి , టిడిపి నాయకులు ఎన్.ఎం.డి. ఫిరోజ్, తులసి రెడ్డి, జనసేన నాయకులు పిడతల సుధాకర్, బీజేపీ నాయకులు ఇలాంటి వారంతా తొలగించడాన్ని వ్యతిరేకించి మా ప్రభుత్వం వస్తే కచ్చితంగా మీకు, మీ కుటుంబాలకు అండగా ఉంటామని మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చి వ్యతిరేక పోరాటం చేశారని, అయితే నేడు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఇచ్చిన మాటను విస్మరించి నేడు బలవంతంగా మాకు ఓట్లు వేయలేదు అనే సాకుతో బొగ్గులైన వాసులందరినీ ఖాళీ చేయించే లా అధికార గణంతో ముందుకు పోవడం సరైనది కాదని అన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో యువగర్జన సభలో లోకేష్ ద్వారా హామీని ఇప్పించి నేడు అవన్నీ మాకు పట్టడం లేదని అధికారం కోసమే మేము అలా చేశామని అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏమైపోతే మాకేమి అన్నట్లు వ్యవహరించడం సరైనది కాదని అక్కడున్న వాసులకు గతంలో ఇచ్చినాము అని చెప్పడం తప్ప నేటి వరకు కూడా శాశ్వత పరిష్కారం చూపడం లేదని కేవలం ఓట్లు వచ్చినపుడు మాత్రమే ఇంటింటికి వెళ్లి దండం పెట్టి మరి మాకు ఓటు వేయించండి, వేయండి మేము మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి నమ్మించడం అలవాటుగా మారిందని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి, అక్కడ అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి ఖాళీ చేయించాలని అట్లా ఏమి చేయకుండా ఖాళీ చేయిస్తామంటే సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోబోమని అడ్డుకుంటామని ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన ఉండకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాము అధికారం ఉంది అంటే అధికారం శాశ్వతం కాదని ప్రజలే శాశ్వతమని గుర్తించుకోవాలని రాబోయే కాలంలో ప్రజల కోపానికి గుడి కాకుండా ఉండాలంటే అక్కడ నివసించే వారందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు.అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ బొగ్గు లైన్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని సిపిఎం పార్టీ చేస్తున్న ధర్నా సమంజసమైనది అక్కడ ఉన్న వారందరి తగిన న్యాయం చేసే వరకు ఖాళీ చేయించబోమని నంద్యాల లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో చూస్తున్నామని వీలైనంత త్వరలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ని ఇవ్వడం జరిగింది
అభివందనములతో దర్శనం లక్ష్మణ్ సిపిఎం పట్టణ కార్యదర్శి నంద్యాల*

