బ్యాంకు ఉద్యోగం సాధించిన మాసన్నోళ్ల లక్ష్మి కి ఘన సన్మానం
//పయనించే సూర్యుడు// మార్చ్ 1మక్తల్ //
మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాసన్నోళ్ల రమేష్ కూతురు మాసన్నోళ్ల లక్ష్మీ ఇటీవల ప్రకటించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ కావడంతో ఆమెను గ్రామస్తులు మరియు పాఠశాల బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రవితేజ మాట్లాడుతూ గ్రామం నుండి మొదటిసారిగా బ్యాంకు ఉద్యోగం సంపాదించిన లక్ష్మీని యువకులు మరియు విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు.పేద కుటుంబానికి చెందిన రమేష్ తన కూతురును ఉన్నత చదువులు చదివించి బ్యాంకు ఉద్యోగం సాధించుటలో చాలా కృషి ఉందని, ఈ విషయం గ్రామానికే గర్వకారణం అని కొనియాడారు.తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్. మాట్లాడుతూ చిన్న గ్రామం అయినటువంటి ఉప్పరపల్లి గ్రామంలో ప్రాథమిక విద్యను మక్తల్ పట్టణం లో ఉన్నత విద్యను అభ్యసించి దేశంలో పెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించడం ఆషామాషి కాదని విద్యార్థి పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె బ్యాంకు ఉద్యోగాన్ని సాధించిందని, లక్ష్మి సాధించిన ఉద్యోగం ఆమెకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సురేష్, సెక్రటరీ సాయినాథ్,గ్రామ పెద్దలు దామోదర్ రెడ్డి, సిద్దు, కోళ్ల వెంకటప్ప బుడేదాన్నోళ్ల బన్నప్ప,రాజు, వియేఓ విజయలక్ష్మి ,ఉపాధ్యాయురాలు పావని,అంగన్ వాడి టీచర్గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.
