PS Telugu News
Epaper

బ్యాంకు ఉద్యోగం సాధించిన మాసన్నోళ్ల లక్ష్మి కి ఘన సన్మానం

📅 01 Mar 2026 ⏱️ 12:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు }{మార్చ్ 1మక్తల్ }

మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాసన్నోళ్ల రమేష్ కూతురు మాసన్నోళ్ల లక్ష్మీ ఇటీవల ప్రకటించిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ కావడంతో ఆమెను ఏడివెల్లి గ్రామంలో నివాసం అయిన ఆమె అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి దగర సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు మరియు గ్రామ సర్పంచ్ అంజనేజులు వారి బృందం అలానే జనసేన పార్టీ ముఖ్య నాయకులు శివ ప్రసాద్. ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామం నుండి మొదటిసారిగా బ్యాంకు ఉద్యోగం సాధించిన లక్ష్మి ని యువకులు మరియు విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు.పేద కుటుంబానికి చెందిన రమేష్ తన కూతురును ఉన్నత చదువులు చదివించి బ్యాంకు ఉద్యోగం సాధించుటలో చాలా కృషి ఉందని, ఈ విషయం గ్రామానికే గర్వకారణం అని కొనియాడారు.తదనంతరం లక్ష్మి.మాట్లాడుతూ చిన్న గ్రామం అయినటువంటి ఉప్పరపల్లి గ్రామంలో ప్రాథమిక విద్యను మక్తల్ పట్టణం లో ఉన్నత విద్యను అభ్యసించి దేశంలో పెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించడం సంతోషంగా ఉంది అని వ్యక్తం చేశారు . గ్రామ పెద్దలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఆషామాషి కాదని విద్యార్థి పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె బ్యాంకు ఉద్యోగాన్ని సాధించిందని, లక్ష్మి సాధించిన ఉద్యోగం ఆమెకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా గ్రామానికి మరియు వాళ్ళ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ అలానే గ్రామ పెద్దలు జనసేన పార్టీ ముఖ్య నాయకులు శివ ప్రసాద్ , గ్రామ యువకులు.గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top