బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య శిబిరం
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈవీ దేవి మేడం ఆదేశాను ప్రకారము యాడికి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ మరియు డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాడికి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల bvసందర్భంగా యాడికి గ్రామంలో రథం లాగుట సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ మెడికల్ క్యాంపు నందు తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని ఇక్కడికి వచ్చిన ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది అలాగే వచ్చిన పేషెంట్లకు మాత్రలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఎం పి హెచ్ ఎ ఎఫ్ స్వర్ణలత ఏఎన్ఎం లు విజయలక్ష్మి లక్ష్మీ ఎం ఎల్ హెచ్ పి వరలక్ష్మి సబిహ ఆశా కార్యకర్తలుమహబూబ్ బి సుజాత సాధకుని మరియమ్మ మొదలగు వారు పాల్గొన్నారు
