PS Telugu News
Epaper

భక్తుల మనసును కలిచివేసిన ఘటన… శ్రీవారి ఆలయంలో పట్టు అంగవస్త్రాల కొనుగోళ్లలో మోసం

📅 10 Dec 2025 ⏱️ 4:10 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పవిత్రపుణ్యం క్షేత్రం తిరుమల తిరుపతిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, వేద ఆశీర్వచనం పొందేందుకుప్రముఖులకు  ఇచ్చే పట్టు అంగవస్త్రాల కొనుగోలులో మరో పెద్ద మోసం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత, నిఘా విభాగం (టీటీడీ విజిలెన్స్) గుర్తించింది. నగరికి చెందిన రూ.100 విలువ చేయని వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పాలిస్టర్‌ క్లాత్‌ను పట్టు వస్త్రం అని చెప్పి రూ.1400కు సరఫరా చేసినట్టు టీటీడీ బోర్డుకు తెలిపింది. 2015 నుంచి 2025 వరకు శ్రీ వారి ఖజానా నుంచి రూ. 54 కోట్లు దోచుకుందని ఆరోపించింది. గతంలో జరిగిన లడ్డూ వివాదంతో పాటు పరకామణి కేసులు ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్నాయి. అయినప్పటికీ తిరుమల ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ ఇప్పుడు గత దశాబ్దంలో తమకు పట్టు అంగవస్త్రాలను విక్రయించిన సంస్థ కోట్లల్లో మోసం చేసిందని ఆరోపించింది. ఆ సంస్థ 2015 నుంచి 2025 వరకు స్వచ్చమైన మల్బరీ పట్టుకు బదులు 100 శాతం పాటిస్టర్ క్లాత్ అంగవస్త్రాలను విక్రయించిందని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ ఆరోపణలు లేవనెత్తిన మోసం వెనుక ఉన్నవారిని కనిపెట్టాలని టీటీడీ బోర్డు రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి ఆదేశించింది.శ్రీవారి ఆలయంలో లోపల వీఐపీ బ్రేక్ దర్శన స్లాట్ సమయంలో దాతలు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను కొనుగోలు చేసే వారిని రంగనాయకుల మండపంలో పూజారులు సత్కరిస్తారు. అదే సమయంలో వేద ఆశీర్వచనం నేపథ్యంలో.. ఇక్కడ దాతలు, ఇతర భక్తులకు టీటీడీ పట్టు అంగవస్త్రాలను అందజేస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు అనేక కోట్ల విలువైన అంగవస్త్రాలను పెద్దమొత్తంలో సేకరిస్తారు. అలాగే ఈ వస్త్రాలు టెండర్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్‌ను ఆదేశించినప్పుడు ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిబంధనల ప్రకారం.. ఆ అంగవస్త్రాన్ని వార్ప్, వెఫ్ట్ రెంటిలోనూ 20/22 డెనియర్ నూలును వినియోగించి పూర్తిగా స్పచ్ఛమైన మల్బరీ సిల్క్‌లో నేయాలని చెబుతున్నాయి. కానీ, ఈ అంగవస్త్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని స్పష్టమైంది.


Scroll to Top