PS Telugu News
Epaper

భద్రాచలం నుండి 151 రూపాయలకే భక్తుడి ఇంటికి కార్గో ద్వారా సీతా రాముల వారి కళ్యాణ తలంబ్రాలు

📅 26 Feb 2026 ⏱️ 7:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్

భక్తుల ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో భక్తులు “భద్రాచలంలో తేదీ 27.03.2026 శ్రీరామ నవమి పండగ రోజు జరిగే శ్రీ సీతా రాములవారి కల్యాణానికి” వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కి ఈ “శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు” మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని రీజినల్ మేనేజర్ శ్రీమతి. టి. జోస్నా తెలిపినారు. ఈ సదుపాయాన్ని tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వార మరియు ఆర్టీసీ కార్గో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా లోని అన్నీ ఆర్.టి.సి. కార్గో కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు.ఈ సదావకాశని మన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము
పూర్తివివరాలకు ఈ దిగువ తెలిపిన పొన్నంబర్లను సంప్రదించవలసినదిగా కోరడమైనది.సంప్రదించవలసిన పొన్నంబర్లు:(1) ఆర్మూర్ డిపో – 7396889496 (2) బోధన్ డిపో -9154298729. (3) నిజామాబాద్-1 డిపో- 9154298727 (4) నిజామాబాద్-2 డిపో – 7396889496 (5) బాన్స్వాడ -9154298729 (6) కామారెడ్డి డిపో-9154298729 (7) R. M office -8639969647 ప్రాంతీయ అధికారి,నిజామాబాదు రీజియన్

Scroll to Top