PS Telugu News
Epaper

“భయానక ప్రమాదం! ఆరుగురి ప్రాణాలు క్షణాల్లో పోయాయి

📅 04 Nov 2025 ⏱️ 1:07 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులన్ని రక్తసిక్తమవుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా దేశవ్యాప్తంగా 50 మంది వరకు మరణించారు. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన సంఘటనలు మరవక ముందే యూపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. బారాబంకి లోని దేవా-ఫతేపూర్‌ రహదారిపై ఓ కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దేవా-ఫతేపూర్‌ హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్కక్కు కారును క్రేన్ సాయంతో పక్కకు తీసి ట్రాఫిన్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Scroll to Top