భారతీయ జనతా పార్టీలో చేరికలు…
రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరిన వారిలో డి.సతీష్ గౌడ్, శేర్ల శివకుమార్ గౌడ్, జాకోర లక్ష్మణ్, తెల్ల రవి, కడారి శేఖర్, దక్కే శివకుమార్, పెంట శివకుమార్ లు చేరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అధ్యక్షులు అలపాటి హరికృష్ణ, కోశాధికారి కటిక రామరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, యువమోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల సీనియర్ నాయకులు, పార్వతి మురళి, చిదుర మహిపాల్, రాజా వరప్రసాద్, మండల ఉపాధ్యక్షులు బెగరివినోద్ కుమార్, వంజరి శ్రీనివాస్, ధర్మవరం వెంకటేష్, బైండ్ల గంగాధర్, బైండ్ల సంజీవ్, గోపి, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు