భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మహా అభియాన్ కార్యక్రమమునకు ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన ప్రారంభమైనది.
ప్రయాణించే సూర్యుడు మార్చి 25 ముమ్మిడివరం ప్రతినిధి
పండిట్ దీనదయాళ్ వారి సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం కార్యకర్తలకు కొత్త దిశను చూపించింది.
ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించారు.
కార్యక్రమానికి కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జిల్లా కో కన్వీనర్ గొల్లకోటి వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ,జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరుమిల్లి శ్రీనివాసరావు,యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర వర్మ, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కోనే రామమూర్తి, బిజెపి సీనియర్ నాయకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, తటవర్తి నాగరాజారావు ,టౌన్ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రముఖ నాయకులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ఇంటిగ్రల్ హ్యూమనిజం, మరియు అంత్యోదయ లక్ష్యాలపై విస్తృతంగా వివరించారు.
అనంతరం స్వల్పాహారంతో కార్యక్రమం ముగిసింది.
