PS Telugu News
Epaper

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని

📅 10 Feb 2026 ⏱️ 7:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మోడీ దిష్టి బొమ్మ దగ్దం

సీపిఐ (ఎంఎల్) ప్రజాపంథా

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు ;దురహంకార అమెరికా సామ్రాజ్యవాది, యుద్దోన్మాది ఆయన ట్రంప్ తో మోడీ ప్రభుత్వం ద్రోహపూరిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలని, నూతన విత్తన చట్టం రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ బిజెపి ప్రభుత్వ దిష్టి బొమ్మలను గ్రామాలలో దగ్ధం చేయాలని పిలుపులో భాగంగా ఈ రోజు కొమరారం గ్రామంలో అల్లూరి సెంటర్లో బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొమరారం గ్రామ కార్యదర్శి కామ్రేడ్ వాంకుడోత్ శంకర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు కామ్రేడ్ నాయిని రాజు డివిజన్ నాయకులు కొమరారం సర్పంచ్ అజ్మీరా బిచ్చ, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిదని ఈ లేబర్ కోడ్ ఇప్పుడున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కనీసం దేశంలో ఉన్న కార్మికు వారి వేతనాలు పెంచాలని సభ్య చేసే హక్కులు కూడా వాళ్ళు కోల్పోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో శాతారావు ధారావత్ దేవా బాధావత్ రమేష్ కుంజ సమ్మన్న తనకాం సత్యం చొప్పదండి రాములన్న భయ్యా వెంకన్న కాంపాటి జగ్గులు కాంపాటి వెంకన్న ఇస్లావత్ కొటేష్ కాంపాటి ప్రసాద్.భుషణం DSP సత్యం సురేందర్ ఏలేందర్ కోరం ముతక్క బుర్రి పద్మ సమ్మెట యమున కుంజ కృష్ణ గూగులొత్ వినోద్ . ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top