PS Telugu News
Epaper

భారత్-రష్యా సంబంధాల్లో కీలక అడుగు—పుతిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు!

📅 28 Nov 2025 ⏱️ 3:20 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4-5 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా నాయకుడిని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు.పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు కీలక ఒప్పందాలు జరగనున్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకోనున్నారు. అయితే రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనకు సుంకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటను ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. అయితే 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా రష్యా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అందుకున్నారు. ఆ తర్వాత రష్యాలోని కజాన్‌లో జరిగిన బిక్స్ సమావేశంలోనూ ఇద్దరూ నేతలు కలుసుకున్నారు.ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడి భారత పర్యటనను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే అప్పుడు పుతిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఆయన భారత పర్యటన కాస్త ఆలస్యం అయింది.

Scroll to Top