PS Telugu News
Epaper

భీంగల్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా చూడాలని సానిటేషన్ సిబ్బందికి ఆదేశించిన కమిషనర్ గోపు గంగాధర్

📅 24 Dec 2025 ⏱️ 6:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలోని లో న్యూ బస్టాండ్ నుండి బస్సులు రాకపోకలు ప్రారంభించినందున బస్టాండ్ ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్ తో క్లీనింగ్ చేయడం మరియు లెవెలింగ్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులను గౌరవ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో చెత్తాచెదరం లేకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. చీకటి ఉండడంతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివైడర్ వెంబడి ఉన్న మట్టిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ జరుగుతున్న శానిటేషన్ పనులను గౌరవ కమిషనర్ పరిశీలించారు ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు

Scroll to Top