భీంగల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వరంలో ఊర పండుగ

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 16. 6 .20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో ఆత్మీయ ఆహ్వానము*సమస్త భీంగల్ పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. ఊర పండుగకు అందరూ ఆహ్వానితులే. భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆవిర్భవించినప్పటి నుండి పలుమార్లు ఊర పండుగను నిర్వహించారు. ఊర పండుగ అనేది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక మరియు మతపరమైన వేడుక. ఈ పండుగను ప్రధానంగా గ్రామ, పట్టణ క్షేమం కోసం పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ ఇత్యాది గ్రామ దేవతల ఆశీస్సుల కోసం ఉర పండుగను నిర్వహించడం మన పూర్వీకుల నుండి వస్తున్న సత్కార్యం. గ్రామాన్ని ,ప్రజలను అంటువ్యాధులు, విష జ్వరాలు ఇతర ప్రకృతి వైపరీత్యాలనుండి గ్రామ సంరక్షణార్థం గ్రామదేవతలు కాపాడుతారని ప్రగాఢ విశ్వాసం. వర్షాలు సకాలంలో కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామదేవతలకు నైవేద్యంగా బోనాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించాలి.ఊరంతా కలిసి కుల, మతాల భేదం లేకుండా పాల్గొనే ఈ పండుగ గ్రామస్తుల మధ్య ఐక్యతను పెంచుతుంది.కావున ఊర పండుగ మహోత్సవ నిర్వహణకు పట్టణ ప్రజలంతా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. అంతేకాకుండా ఈ మహత్కార్యంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని సహృదయంతో ఆకాంక్షిస్తున్నాం.సర్వ సమాజ్ అభివృద్ధి కమిటి భీంగల్

🌐 Select Language:
📰 ePaper