భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ఎస్ పార్టీలో చేరిక
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్ మరియు కర్నె నరేష్ లు శుక్రవారం భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న BRS పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసి చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
