భైంసాలో ఘనంగా శ్రీ సత్యానంద మహర్షి 501వ సంచార సత్సంగం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ సత్యానంద మహర్షి వారి 501వ సంచార సత్సంగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీ శివ రామకృష్ణ ఆశ్రమం పీఠాధిపతి పూజ్య శ్రీ వీరజానంద తీర్థ స్వామి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా స్వామి వారు మాట్లాడుతూ, భగవద్గీత మానవాళికి భగవంతుడు ప్రసాదించిన అమృతమని, ప్రతి ఒక్కరూ దానిని అధ్యయనం చేసి, ఆచరణలో పెట్టి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భగవద్గీతలోని బోధనలు మనిషికి ధర్మమార్గాన్ని చూపించి, శాంతి, సుఖం మరియు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాయని వివరించారు.ఈ సత్సంగంలో మెట్‌పల్లి, కోరుట్ల మరియు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు