PS Telugu News
Epaper

భైంసాలో డాండానీ నూతన కార్యాలయ ప్రారంభం

📅 19 Dec 2025 ⏱️ 1:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బైంసా ప్రజలకు నేరుగా సేవలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్,డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

భైంసా: భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో . విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ డాండానీ (DHANDANI) నూతన కార్యాలయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ లఖన్ ధూతద్మల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త యోగేశ్ వర్మ ముఖ్యఅతిథిగా, ప్రత్యేక అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రియల్ ఇండియా అవసరాలకు అనుగుణంగా డాండానీ సేవలు ఈ సందర్భంగా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ మాట్లాడుతూ, డాండానీ ఒక వన్-స్టాప్ డిజిటల్ క్రెడిట్ ప్లాట్‌ఫామ్గా పనిచేస్తుందని, వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే రుణాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత సేవల ద్వారా తక్కువ పేపర్‌వర్క్‌తో, వేగంగా రుణాలు అందించడమే లక్ష్యంగా డాండానీ పనిచేస్తోందన్నారు.అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు సురక్షితంగా తమ ఆర్థిక సమాచారాన్ని పంచుకుంటూ రుణాలు పొందుతున్నారని, ఈ వ్యవస్థలో డాండానీ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.నూతన కార్యాలయం ప్రారంభంతో భైంసా పట్టణంతో పాటు పరిసర మండలాలు, గ్రామాల ప్రజలకు రుణాలపై సలహాలు, మార్గదర్శనం, డిజిటల్ క్రెడిట్ సేవలు నేరుగా అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది ఎంతో ఉపయోగకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగేశ్ వర్మ, నాగనాథ్ పటేల్, ఓం ప్రకాష్ లడ్డ మాట్లాడుతూ, భైంసా వంటి పట్టణంలో డాండానీ కార్యాలయం ప్రారంభం కావడం ఆనందకరమని, ఇది స్థానిక వ్యాపార వర్గాలకు, యువతకు మంచి అవకాశాలు తీసుకువస్తుందని అభినందించారు.

Scroll to Top