భైంసా పట్టణంలోని నారాయణ పాఠశాలలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ఖండించిన అఖిల భారతీయ విద్యా పరిషత్ మహిషా శాఖ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహిషా శాఖ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ పాఠశాలలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలలో గత కొన్ని రోజుల నుండి 9 వ తరగతి విద్యార్థులకు 10 వ తరగతి అడుగు పెట్టక ముందే విద్యార్థుల తల్లిదండ్రులు నుండి 50% శాతం 10 వ తరగతికి ఫీజ్ ను వసూలు చేయడం జరుగుతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఎం ఈ ఓ సార్ తెలియజేయడం జరిగింది ఆయన అ విషయం పట్టించుకోకపోవడం తో ఏబీవీపీ నాయకులకు చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు నారాయణ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ విషయం ఎం ఈ ఓ తెలిసిన వెంటనే పాఠశాలకు రావడం జరిగింది. ఈ విషయం పై ఏబీవీపీ నాయకుడు స్టేట్ హాస్టల్ కో కన్వీనర్ గంగప్రసాద్ మాట్లాడుతూ ఈ పేద ధనిక విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు అలాగే రైతు కుటుంబాల నుండి విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటే అలాగే 9 వ తరగతి పూర్తి కాక ముందే 10 వ తరగతి చదువు కోసం ముందుగా పాఠశాల లో 50% 10 వ తరగతి ఫీజ్ ను చెల్లించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అని ఈ పాఠశాల పై ఎం ఈ ఓ వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే 18 ముందుగా తీసుకున్న ఫీజ్ ను వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాలని అలాగే పాఠశాలకు షోకస్ నోటీస్ ఎంఈఓ జారీ చేయాలి అని అలాగే ఈ విషయం పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది
