PS Telugu News
Epaper

భైంసా పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

📅 10 Mar 2026 ⏱️ 4:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

రైతుల సంక్షేమం, పశుసంపద రక్షణలో భాగంగా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్, హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, పశుపోషకుల అభివృద్ధే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పశుసంపదను కాపాడేందుకు గాలికుంటు వంటి వ్యాధుల నివారణకు టీకాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ పశుసంవర్ధక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతులు పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని, పశుసంపదను రక్షించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Scroll to Top