PS Telugu News
Epaper

భైంసా పట్టణంలో డా. రాజారెడ్డి నూతన ఆరాధన హాస్పిటల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

📅 28 Feb 2026 ⏱️ 4:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

భైంసా పట్టణంలోని డాక్టర్ రాజారెడ్డి నూతన ఆసుపత్రి భవన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి, వినూత్న వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.అనంతరం ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, నాయకులు వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.*

Scroll to Top