భైంసా పట్టణంలో పలు హోటల్ ,స్వీట్ హోమ్స్ , బేకరీలలో మున్సిపల్ కమిషనర్, మరియు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి:భైంసా పట్టణంలోని పలు హోటల్లో, స్వీట్ హోమ్స్, టిఫిన్ సెంటర్, బేకరీలలో మునిసిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలలో పరిశుభ్రతను పరిశీలించారు, స్వీట్ హోమ్స్ ,హోటల్లో మరియు బేకరీ,టిఫిన్ సెంటర్ల నిర్వాహకులను తప్పనిసరిగా శుభ్రత పాటించాలని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన అపరిశుభ్రత వాతావరణం కొనసాగించిన రసాయనాలు అధికంగా వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులను అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బైంసా మున్సిపల్ కమిషనర్ లింగయ్య ,ఇన్స్పెక్టర్ మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.