భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి ఆహ్వానం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి, ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ, ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రామాణికత, కళాశాలలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా ప్రారంభమవుతున్న కోర్సులు, వాటి ప్రాధాన్యత, విద్యార్థులకు అవి కలిగించే ఉపయోగం వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.రాబోయే పరీక్షలకు విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో కూడా ఈ సమావేశంలో మార్గదర్శకాలు ఇవ్వబడతాయని తెలిపారు. కాబట్టి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
