భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో మహా పోచమ్మ తల్లి 3వ వార్షికోత్సవం
పోచమ్మ తల్లికి చల్లని అంబళ్ళు”కార్యక్రమం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
కామోల్ గ్రామంలో పోచమ్మ ఆలయంలో చల్లని అంబల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన యాత్రలో పాల్గొని భక్తులతో కలిసి ఊరేగింపుగా కార్యక్రమాన్ని కొనసాగించారు.స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఉత్సవం ఘనంగా కొనసాగిందని తెలిపారు.
