మంచి నీటి సరఫరా లో ఇబ్బంది లేకుండా చూడాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
పబ్లిక్ హెల్త్,రోడ్డు మరియు భవనాల శాఖ,భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు మార్చి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఎక్కడైనా సరే పైప్ లైన్ లీకేజి జరిగితే తక్షణమే స్పందించి లైకేజీలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. అమృత్ స్కీమ్ లో భాగంగా చేపడుతున్న ట్యాంక్ ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా మిగిలిన పైప్ లైన్ కనెక్షన్ తో పాటు ట్యాప్ కనెక్షన్లు కూడా త్వరగా ఇవ్వాలని కోరారు.షాద్ నగర్ పట్టణంలో పైప్ లైన్ తవ్వకాలు,కేబుల్ లైన్ తవ్వకాలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, అనుమతులతో జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ లలిత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కవిత,రోడ్డు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సందీప్,అబ్దుల్ బారి,అన్ని మండలాల మిషన్ భగీరథ గ్రిడ్,ఇంట్రా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మున్సిపల్ డిఇ నరేష్,పబ్లిక్ హెల్త్ డిఇ సాజిద్ ,ఇలియాస్ పాల్గొన్నారు.
