PS Telugu News
Epaper

మంచి మనసున్న మహారాజు మా రామదాస్ నాయక్ అన్న

📅 21 Oct 2025 ⏱️ 3:51 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామం భగవాన్ నాయక్ తండ నుండి రేపల్లెవాడ గ్రామ సమీపంలోని బిటి రోడ్డు వరకు ఉన్నటువంటి రహదారి సమస్య గురించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఎన్ని పర్యాయలు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు గ్రామానికి వచ్చినప్పుడల్లా నేను చేసి పెడతా అని చెప్పుకుంటూ వారి పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు కానీ రోడ్డు పని మాత్రం పూర్తి చేయలేక పోయారు ఇప్పుడున్న వైరా శాసనసభ్యులు అయినటువంటి మాలోత్ రామదాస్ నాయక్ అన్న నీ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి ఒకే ఒక్కసారి తమ గ్రామ సమస్యలను తెలియపరచగా చెప్పిన మరుక్షణమే నేనున్నాను మీ సమస్య కాదు అది నా సమస్య అని చెప్పి మరి అట్టి పనిని రెండు కోట్ల పది లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ప్రజా నాయకుడు మా రాందాస్ నాయక్ అన్న అని గ్రామ ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తపరచడం తోపాటు గ్రామ ప్రజలందరూ రామదాస్ నాయక్ అన్నకు రుణపడి ఉంటారు అని గ్రామస్తులందరూ తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో అజ్మీర సురేష్ నాయక్ నిమ్మల నరేందర్ నిమ్మల నాగేశ్వరావు తంబళ్ల సామిల్ శాంతారావు ప్రకాష్ సభస్టిన్ విజయరావు భూక్య బద్దు కిషోర నరేష్ కృష్ణ భువనేశ్వర్ రాజు శర్మ కర్యావుల నరసింహారావు వీరభద్రం నిమ్మల రాము గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top