PS Telugu News
Epaper

మంజూరైనవివిధ గ్రాంట్ల రాష్ట్రానికి తీసుకురాలేని బిజెపి ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలి

📅 21 Feb 2026 ⏱️ 6:38 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : . సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, ప్రజాపంథా. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి…వి ప్రభాకర్. జిల్లా నాయకులు. బి. దేవా రాములు డిమాండ్… అధికారంలో రావడానికి బిజెపి సాధ్యం కానీ అమలు చేయలేని వాగ్దానాలను, వాట్సాప్ యూనివర్సిటీ లో విస్తృత ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదా నీ అంబానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఈ సందర్భంగా వి. ప్రభాకర్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్,కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి. జిల్లా నాయకులు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి. బి దేవారంలు అన్నారు..20 24 -25 సంవత్సరం వివిధ వివిధగ్రాట్లలో 21636.15 మంజూరు అయితే రాష్ట్రానికి కేవలం.5451.85 వచ్చింది అంటే సుమారుగా 24% మాత్రమే… ఈ విధంగా 20 25-20 26 సంవత్సరంలో 22 వేల కోట్ల 782 మంజూర్ అయితే, రాష్ట్రానికి ఇప్పటివరకు 4, 713 మాత్రమే వచ్చింది అంటే 18 శాతం.. రావలసిన బకాయిలు 18569 కోట్లు.. గ్రామపంచాయతీ.. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రానికి మీ వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకున్న బిజెపి నాయకులు మన రాష్ట్రాలకు మంజూరైన గ్రాంట్లను తీసుకురావడానికి ఇంకా 40 రోజులు వాయిదా మాత్రమే ఉంది అని మేము గుర్తు చేస్తున్నాం.. ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు అందులో ఇద్దరు మంత్రులు సొంత రాష్ట్రాన్ని నిధులు తీసుకురాలేక వైఫల్యం చెందిన వారు కాబట్టి రాజీనామా చేయండి చేత కాకపోతే డిమాండ్ చేస్తున్నామన్నారు…మన రాష్ట్రానికి రావాల్సిన పనుల వాటాలో ఇంకా 4,698 కోట్ల 42 లక్షలు రావాల్సి ఉంది. ఏ కాక 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామపంచాయతీలకు 3000 కోట్లు రావాల్సింది ఉంటే మూడు దఫాలుగా 1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఎప్పుడు తెస్తారయ్యా అసలు ఇది మీరు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు మర్చిపోయారా! లేకపోతే బాత కానీ, సొంత పైరవీలు చేసుకోవడానికి పార్లమెంటుకు పోతున్నారా అని ప్రశ్నించారు….మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చకుండా యధావిధిగా కొనసాగించాలని… పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు..
అమెరికా తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే దేశ రైతాంగం.(పాడి,, రైతులు) నిండా మునుగుతుందని.. నీ ఇంటికి వస్తే ఏం పెడతావు! నా ఇంటికి వస్తే ఏం తెస్తావ్ అన్న చందంగా ఈ ఒప్పందం ఉందని ఎద్దేవా చేశారు.. ఇప్పటికే ట్రంప్ విధించిన సుంకాలను తన సొంత దేశమైన అమెరికా సుప్రీంకోర్టు తప్పు పట్టిందని హెచ్చరించిందని ఈ తీర్పు అయిన మోడీకి కనువిప్పు కలిగిస్తుందని ఎట్లాగూ ట్రంప్ కు సిగ్గు శరం లేకుండా మూడో ప్రపంచ దేశాల్ని ఎదిరించి బెదిరించి తన గుప్పిట్లో పెట్టుకోవడమే తన లక్ష్యమని మోడీకి గుర్తు చేస్తున్నాం..రాష్ట్ర హక్కుల్ని కాపాడలేని పార్లమెంటు సభ్యులు మంత్రులు ఉంటే ఎంత పోతే ఎంత అని చందంగా ఉందని చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు…
ఈ పాత్రికేయ మిత్రులు సమావేశంలో యు సి ఐ నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు. ఎం ముత్తెన్న. ఏఐయుకేఎస్ జిల్లా కార్యదర్శి. బి కిషన్. నాయకులు. ఆకుల గంగారం.యు రాజన్న. పి డి ఎస్ యు నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు. ఎం నరేందర్. కార్యదర్శి. నిఖిల్. పోషన్న. నజీర్. తదితరులు పాల్గొన్నారు.ఉద్యమ అభినందనలతో బి కిషన్.సిపిఐ ఎంఎల్. మాస్ లైన్.(ప్రజా పంథా) ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి…

Scroll to Top