PS Telugu News
Epaper

మండపల్లి గ్రామంలో ఇసుక వాహనాలపై గ్రామస్తుల ఆగ్రహం – వేబిళ్లు నిలిపివేయాలని డిమాండ్

📅 25 Oct 2025 ⏱️ 6:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండేపల్లి గ్రామంలో ఇసుక రవాణా విషయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తరచుగా జరుగుతున్న ఇసుక రవాణా ఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు, గ్రామంలోని అన్ని మార్గాల్లో ట్రాక్టర్లను ఆపి ధర్నా నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతుండటంతో పర్యావరణానికి నష్టం, మరియు అనేక సంఘటనలు జరుగుతున్నాయని దృష్టిలో పెట్టుకొని నిన్నటి రోజున కరెంటు వైర్ తెగి కింద పడటం దగ్గర్లో స్కూలు మరియు వ్యవసాయం చేసే వారు నడుస్తారు. ఇసుక ట్రాక్టర్ల వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇసుక ట్రాక్టర్ల వల్ల అనేక ఘటనలు జరుగుతుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని మండపల్లి గ్రామం నుండి ఇసుక వేబిళ్లు ఇవ్వడం నిలిపివేయాలని ఎమ్మార్వోకు డిమాండ్ చేశారు.గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

Scroll to Top