మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి నిశాంక్ రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక
పయనించే సూర్యుడు, డిసెంబర్ 05( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎన్. నిశాంక్ ఉమ్మడి కరీంనగర్ ఎస్ జి ఎఫ్ గేమ్స్ ఫైనల్లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 38 పరుగులు, బౌలింగ్‌లో మూడు వికెట్లు సాధించి రాజన్న సిరిసిల్ల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్ మ్యాచ్‌లో తన మెరుపు ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నిశాంక్, రేపు భద్రాచలంలో జరగనున్న రాష్ట్ర స్థాయి SGF క్రికెట్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఈ విజయంపై పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మొహమ్మద్ హనీఫ్, ప్రిన్సిపాల్ మామిళ్ల విట్టల్, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, నిశాంక్ రాష్ట్ర స్థాయిలో కూడా మరింత ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.