PS Telugu News
Epaper

మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామస్థుల నిరసన రెవెన్యూ అధికారులు దిగి పరిశీలన

📅 25 Oct 2025 ⏱️ 6:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రాత్రిపూట 5 ఎకరాల ప్రభుత్వ భూమిని దున్ని చెట్లు నాటిన ఘటన.

భూమి ప్రభుత్వానికి చెందాలి లేదా గ్రామాభివృద్ధికి వినియోగించాలి అని డిమాండ్.

ఆర్‌ఐ దినేష్‌, జిపిఓ వేణు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నారు.

భూమికి పత్రాలు ఉంటే రాత్రిపూట పనులు ఎందుకు?”

377 సర్వే నంబరులో 360 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో; మిగిలినది పశువుల మేతకు ఉపయోగపడుతుంది. భూమిని క్రీడా ప్రాంగణం లేదా ప్రజల అవసరాలకు కేటాయించాలని విజ్ఞప్తి.

పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఘటన చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి రాత్రిపూట దున్ని చెట్లు నాటడంతో, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, ఆర్‌ఐ దినేష్‌, జిపిఓ వేణు, రెవెన్యూ సిబ్బందితో కలిసి శనివారం రోజున స్థలాన్ని పరిశీలించారు.గ్రామస్థులు మాట్లాడుతూ — “భూమి ప్రభుత్వానికి చెందినదే అయితే దానిని గ్రామ అభివృద్ధి కోసం వడ్ల బీటు లేదా క్రీడా ప్రాంగణంగా మార్చాలి” అని విజ్ఞప్తి చేశారు. “భూమికి నిజంగా పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నడమేంటి? రాత్రిపూట చెట్లు నాటడం ఎందుకు?” అని ప్రశ్నించారు.ఇప్పటికే గ్రామంలోని 377 సర్వే నంబరులో 360 ఎకరాల భూమి ప్రభుత్వం అధీనంలో ఉందని, మిగిలిన భూమి కూడా ఇలాంటి భూకబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పశువులు మేకలు మేయడానికి ఉపయోగపడే ఈ భూమిని ప్రజల ప్రయోజనానికి కాపాడాలని వారు కోరారు.

Scroll to Top