PS Telugu News
Epaper

మందలో ఒకరిగా మిగిలిపోతారా..?వందలో ఒకరిగా వెలిగిపోతారా. రవీందర్ గౌడ్

📅 26 Aug 2025 ⏱️ 2:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

మొదటిది ఈజీయే! రెండో కోవలో చేరాలనుకుంటేనే..భిన్న ఆలోచనలను మనసులో మొలకెత్తించాలి!విలక్షణ నిర్ణయాలను ఆచరణలో ఉరకలెత్తించాలి.!!
సమస్యలూ,సవాళ్లూ, అవరోధాలూ,అవకాశాలూ అందరికీ సమానమే. చూసే దృక్కోణం,స్పందించే విధానమే వేరు కాబట్టి మనం ఎప్పుడూ విభిన్న ఆలోచనలతో విలక్షణ పంథా అవలంబించే సృజనశీలిగా మారాలే కానీ, సాదాసీదాగా రొటీన్ దారిలో నడిచే గుంపులో ఒకరిలా మిగిలిపోకుండా చూసుకోవాలి లేకపోతే ఇప్పుడున్న వేగవంతమైన కాలంలో కనుమరుగైపోడం ఖాయం..తస్మాత్ జాగ్రత్త. జీవితాన్ని ఎలా మొదలు పెట్టావు అనే దానికంటే ఎలా ముగించావు అనేదే ముఖ్యం.
మనిషి పుట్టినప్పుడు ప్రేమగా ఎత్తుకోవడానికి ఎంతమంది ఉన్నా..మనిషి చనిపోయినప్పుడు మనస్పూర్తిగా కన్నీళ్ళు కారుస్తూ ఎత్తే నలుగురు మనుషులను సంపాదించుకో.. అది లేనప్పుడు నువ్వేంత పెద్ద హోదా పదవిలో ఉన్నా,నీ దగ్గర ఎంత ఆస్థిపాస్తులున్నా అది నిరుపయోగమే..కాబట్టి అలాంటి వారిని పొందిన వారిదే నిజమైన జీవితం.!

Scroll to Top