మక్తల్: వీరభద్ర స్వామి ఆలయంలో అన్నదానం
// పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 19మక్తల్ //
మక్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీరభద్ర స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అన్నదాతలు బొలెరి ఆశప్ప-శ్యామలమ్మ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్వాహకులు జి.శివకుమార్,మేస్త్రి.కల్లూరి నాగప్ప. కొండయ్య. పీకే నరసింహ నాయుడు. రామంజి.తదితరులు పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రతి అమావాస్య కు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
