మగ్గంవర్క్ తో మహిళలకు చేయూత పిడి
” పయనించే సూర్యుడు డిసెంబర్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు మగ్గం వర్క్ . ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్ ఎంతగానో దోహదపడతాయని డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజకుమారి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన చేజర్ల వెలుగు కార్యాలయం లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ యస్ఇటిఐ గ్రామీణస్వయం ఉపాధి శిక్షణ సంస్థ వెంకటాచలం నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ ను నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆధారిత కుటుంబాలు ఎక్కువగా వుంటాయని, తద్వారా కుటుంబ పోషణ కు మహిళలు కూడా తోడ్పాటు అందించేందుకు ఈ పని ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ లకు మహిళలు ఎక్కువ గా మగ్గం వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ పని వారి ఆర్ధికాభివృద్ధికి మంచి తోడ్పాటునివ్వగలదన్న ఆలోచన తో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. 35 మంది మహిళలకు ఈ పధకం లో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ఇన్స్ట్రక్టర్ ను నియమించి ఈ శిక్షణ ఇవ్వనున్నామన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ కెనరా బ్యాంకు మనిశేఖర్, అర్ యస్ ఇటిఐ డైరెక్టర్, డిపిఎం ఎల్.హెచ్. మధు సూదన్, ఏపీఎం. నాగేంద్ర ప్రసాడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఏపిజిబి మేనేజర్, ఏపిఎం సుజన, సిసి లు ఈ కార్యక్రమం లో వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
