PS Telugu News
Epaper

మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరముగా విఫలం . కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

📅 26 Aug 2025 ⏱️ 5:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాల పంపిణీకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని ప్రతి డివిజన్‌కు కనీసం 1000నుండి 2000 వరకు మట్టి వినాయక విగ్రహాలు అందజేయడం ద్వారా ప్రజలలో పర్యావరణ అవగాహన పెంపొందించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి సంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించిందని స్వయానా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం పరిపాలనా వైఫల్యం కారణంగా ఈసారి ప్రతి డివిజన్‌కు కేవలం 200 విగ్రహాలకే పరిమితం చేశారని ఇది ప్రజల ఆత్మీయ విశ్వాసాలను అవమానపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు పెద్ద దెబ్బతీసిందని ప్రజలకు లభించాల్సిన సౌకర్యాలను కత్తిరించడం పర్యావరణహిత కార్యక్రమాలను అణగదొక్కడం ప్రస్తుత ప్రభుత్వ తీరును బహిర్గతం చేస్తోందని రేవంత్ రెడ్డి మాటలకే పరిమితమై ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజా ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారని అన్నారు.

Scroll to Top