
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి నగర్, కేశవ్ నగర్ లో మతమార్పిడులకు పాల్పడుతున్న పలువురిని హిందూ సంఘాల వారు అడ్డుకున్నారు. సందర్భంగా వారు మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అందించి మతమార్పిడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దరఖాస్తు అందజేసిన వారిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తో పాటు హిందూ ఆర్థిక సంస్థల వారు పాల్గొన్నారు.