PS Telugu News
Epaper

మత్తు పదార్థాలుతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దుజె ఎన్ టి యు రిజిస్టర్ ప్రో! వెంకటేశ్వర రావు

📅 29 Dec 2025 ⏱️ 5:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

యూనివర్సిటీ లో జనవరి 4 వ తేదీన ఎల్లమ్మబండలో మేర యువ భారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన కొరకు నిర్వహించే యువ చైతన్య యాత్ర పోస్టర్ ను ప్రారంభించిన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు. ఈ సందర్భంగా రిజిస్టర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో నేర్చుకోవాలి అన్నారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజహితం కోసం నిర్వహించే ఈ యాత్రలో పెద్ద ఎత్తున యువత పాల్గొని విజయవంతం చెయ్యాలి అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ, సందీప్, సభ్యులు జయరాం,పవన్, సాయి రామ్, రాంచరణ్, యెషోవర్ధన్, విక్రమ్,రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top