మనసున్న మహారాజు మా కెపి అన్న
గుడి అభివృద్ధికి ₹11,000 విరాళం
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలకు మద్దతుగా కేపీ గారు గుడికి ₹11,000 (పదకొండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.ముస్లిం సమాజానికి చెందిన ఆయన, మత భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం నిజమైన సామరస్యానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.“మతాలు వేరు అయినా మనసు ఒకటే” అనే సందేశాన్ని కార్యరూపంలో చూపించిన కేపీ గారి సేవాభావం ప్రశంసనీయం అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.గ్రామ ప్రజలు ఆయనను “మనసున్న మహారాజు”గా అభివర్ణిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.