PS Telugu News
Epaper

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు

📅 22 Feb 2026 ⏱️ 1:47 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి, భారతీయ టెక్నాలజీ, ఏ వన్ సాఫ్ట్వేర్, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి, మహిళ సాధికారత, గతంలో జరిగిన మహా కుంభ మేళా, పర్యావరణ పరిరక్షణ, “వోకల్ ఫర్ లోకల్” వంటి ముఖ్య అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకొస్తున్న సాధారణ ప్రజల సేవలను ఆయన ప్రశంసించారు.కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆలకించిన నాయకులు మరియు కార్యకర్తలు ప్రధానమంత్రి ప్రేరణాత్మక సందేశాన్ని అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలను ఒకే వేదికపై కలిపి, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి ప్రేరేపిస్తోందని వారు పేర్కొన్నారు.దేశాన్ని అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ యువమోర్చ కార్యదర్శి రుద్రరాజు నరేంద్ర వర్మ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి యువమోర్చ అధ్యక్షులు కళ్యాణ్ గానాల, అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు , తట్టవర్తినాగరాజు రావు, మరియు బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Scroll to Top