మన శంకర్ వరప్రసాద్ సినిమా తొలి టిక్కెట్ దక్కించుకున్న మెగా అభిమాని మోకాకు నిర్మాతల సత్కారం
పయ నించే సూర్యుడు జనవరి 8
: అమలాపురం వెంకటరమణ థియేటర్
వద్ద మంగళవారం నిర్వహించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా వేలంపాటలో తొలి టికెట్ రూ.1 లక్ష 11 వేల రూపాయలకు దక్కించుకున్న మెగా అభిమాని మోకా సుబ్బారావును సినీ నిర్మాతలు ఘనంగా సత్కరించారు.బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన మన శంకర్ వరప్రసాద్ గారు ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా మోకా సుబ్బారావును ప్రత్యేకంగా ఆహ్వానించిన సినీ నిర్మాతలు కొణిదల సుస్మిత, గారపాటి శభు తమ చేతుల మీదుగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ ప్రతినిధులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు తదితరులు పాల్గొన్నారు.